హైదరాబాద్: అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు.
చిట్యాల ఐలమ్మ ఆకాంక్షలకు అనుగుణంగానే.. పదేండ్ల బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలిప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ, ప్రగతి కార్యాచరణను అమలుచేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలతో పలు పథకాలను అమలుచేసి వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిపిందన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారంగా నిర్వహించాలని నిర్ణయించి అమలుచేసిందన్నారు. బలహీన వర్గాలు, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయడమే ఐలమ్మకు మనమర్పించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
అణిచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.… pic.twitter.com/7gAtvtMad4
— BRS Party (@BRSparty) September 26, 2024