హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యమ నేపథ్యంపై తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రచించిన ‘కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ అనే పుస్తకాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.30 కు నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో, మంత్రి జగదీశ్ రెడ్డి నివాస ప్రాంగణంలో ఈ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, సమాచార శాఖ చీఫ్ కమిషనర్ బుద్దా మురళి, కమీషనర్లు కట్టా శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్, పటేల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు, సీఎం పీఆర్వో రమేశ్ హజారే, సామాజిక విశ్లేషకులు ఒంటెద్దు నర్సింహరెడ్డి, సామా భరత్ కుమార్ గుప్తా, రామానందతీర్థ గ్రామీణ విద్యా సంస్థ డైరెక్టర్ నారా కిశోర్, కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్ పుస్తక అనువాదకులు దామోదరాచారి తదితరులు పాల్గొననున్నారు.