మహబూబ్‌నగర్ అర్బన్ : తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కల్వకుంట చంద్రశేఖర్ రావు ( K Chandrashekar Rao) . పాలు తాగే పిల్లాడి నుంచి పండు ముసలి వరకు కేసీఆర్ అనగానే అదో వైబ్రేషన్. కేసీఆర్ స్వయాన కళ్లేదుట లేకపోయిన ఆయన కనిపించే ఫోటోకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఊరూరా వాల్‌పోస్టర్లు, పేయింటింగ్లు, మైక్‌ల ద్వారా ప్రచారంతో పల్లెలు మారుమోగి పోతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పేదల పాలిటి దేవునిగా నిలిచి, తెలంగాణ బాపుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌కు ఓ వృద్ధురాలు ( Old Women) నమస్కరించి ఆశీర్వదించారు.
మహబూబ్ నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చలో వరంగల్ పోస్టర్‌ను గోడ మీద అంటిస్తుండగా అక్కడకు వచ్చిన వృద్ధురాలు పోస్టర్లో ఉన్న కేసీఆర్‌ను చూసి దండం పెట్టారు. ‘ కేసీఆర్ సల్లంగ ఉండాలే. మళ్లీ నువ్వే అధికారంలోకి రావాలే ’ అంటూ దీవెనలు అందించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెలా పింఛన్ అందించేవారని, పంట పొలాలు సక్రమంగా సాగయ్యేవని ఆమె గుర్తు చేసుకున్నారు.