KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి (Ganesh Chaturthi) శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణేశుడిని ప్రార్ధించారు గులాబీ బాస్. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటారని కేసీఆర్ అన్నారు.
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణనాధుని నవరాత్రి వేడుకలు పల్లె నుండి పట్టణం దాకా ప్రజల సాంస్కృతిక ఐక్యతను పెంచుతాయని కేసీఆర్ వెల్లడించారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్ ప్రార్థించారు.