తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ అస్తిత్వ పతాకగా, రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆరాధన పూరితంగా ఉన్న తెలంగాణ తల్లి రూపం, సారం, నేపథ్య అంశాలతో జూలూరు ఆ పుస్తకాన్ని తెచ్చారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్‌ను కేసీఆర్ అభినందించారు.