హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కేంద్ర ప్రభుత్వ, పీఎస్యూల ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ దానకర్ణాచారి అభిలషించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులను గంపగుత్తగా ప్రైవేటీకరిస్తున్నదని మండిపడ్డారు.