KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన విధానాలు, పరిపాలన విధానాలు ఆదర్శనీయమని, అవే తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపాయని సోషల్మీడియాలో ఆర్థికవేత్తలు, మేధావుల మధ్య ఆసక్తికర చర్చ కొనసాగుతున్నది. ఎక్స్ వేదికగా ముత్తుకృష్ణన్ అనే ఆర్థికవేత్త ‘2014 నుంచి 2023 వరకు తెలంగాణ సాధించిన అభివృద్ధిని భారతదేశంలోని మరే రాష్ట్రం సాధించలేదు. ఇది నా స్వంత పరిశోధనల నుంచి తెలుసుకున్నది.
కేసీఆర్ గత దశాబ్ద కాలంగా తెలంగాణకు ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన అభివృద్ధిని చేశారని నా పరిశోధనతో నేను నిర్ధారించాను. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఎందుకు అలా తిరస్కరించారో నాకు తెలియడం లేదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై మరో ఆర్థిక, సామాజికవేత్త అర్వింద్ వారియర్ స్పందిస్తూ ‘నేను 2021లో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అభివృద్ధి నమూనాను పరిశోధించడం ప్రారంభించాను. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం సాధించిన భారీ విజయాలను చూసి ఆశ్చర్యపోయా’ అని వెల్లడించారు. వారిద్దరే కాదు ఆ పోస్టుపై అనేక మంది మేధావులు తెలంగాణ అభివృద్ధిపై పోస్టులు పెడుతూ తమ పరిశోధనలు, అభిప్రాయాలను
వెల్లడిస్తున్నారు.