హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్‌రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల్ బడ్జెట్లు. ఇందులో అత్యధిక సమయం చదివిన మంత్రిగా హరీశ్‌రావు నిలిచారు.
ఆర్థికశాఖ మంత్రిగా హరీశ్ రావు సోమవారం నాటి బడ్జెట్‌తో నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అత్యధికంగా గంటా యాభై ఒక్క నిమిషాల (1.51 గంటలు) పాటు చదివి సరికొత్త రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ తన వద్దే ఉన్న సమయంలో రెండు బడ్జెట్లను, ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.