హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తన సొంత పార్లమెంట్ స్థానం అమేథిలో కూడా గెలువలేని రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ జోడోయాత్రలో బీఆర్ఎస్ పార్టీపై రాహుల్‌గాంధీ విమర్శించారు.
దీనిపై మంగళవారం ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందించారు. ప్రధాని కావాలనుకొంటున్న రాహుల్ ముందుగా తన నియోజవకర్గ ప్రజలను ఒప్పించి ఎంపీగా ఎన్నుకొనేలా చూడాలని సెటైర్ వేశారు.