భారత్ రాష్ట్ర సమితి భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నది. తెలంగాణ అభివృద్ధి మాడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి ఎంతో అవసరం. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికి రోల్ మాడల్‌గా నిలిచింది. దేశానికి తెలంగాణ అభివృద్ధి ఒక నమూనాగా కనిపిస్తున్నది. దేశ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో హామీలు తప్ప ఆచరణ లేదు. అన్ని రంగాల్లో దేశాన్ని దివాలా తీయించారు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
లౌకిక దేశంలో మత విద్వేషంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ వైఖరి, మోదీ పాలన పట్ల దేశప్రజలు విసుగు చెందారు. దీన్ని క్షుణ్ణంగా గమనించిన ప్రజలు రానున్న రోజుల్లో గాంధేయ మార్గంలో నడిచే కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ మాడల్ అభివృద్ది పాలన కావాలని బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు భవనాలశాఖ మంత్రి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. దీంతో లెజండరీ లీడర్ కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్న అసామాన్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను యావత్ దేశ ప్రజలు త్వరలోనే అనుభవించబోతున్నారు. తెలంగాణ మాడల్ యావత్ దేశానికే దిక్సూచి కాబోతున్నది.
– ట్విట్టర్లో ఎంపీ సంతోష్‌కుమార్
దసరా పండుగ రోజు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలకు ఎంతో అవసరం. ఎందరో మహామహుల్ని ఎదిరించి, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో ఏండ్ల కలను కేసీఆర్ సాకారం చేశారు. ఆయన పోరాట పటిమ, చిత్తశుద్ధి దేశానికి ఎంతగానో అవసరం. బీఆర్ఎస్తో కేసీఆర్ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సంచలనం నమోదు చేయడం ఖాయం.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
నూతన జాతీయ పార్టీని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటిం చడం కీలక సమయంలో తీసుకొన్న సరైన నిర్ణయం. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ దేశ అభివృద్ధి, సంక్షేమంలో మూలమలుపు కాగలదు. కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కొనే బలమైన ప్రత్యామ్నాయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఆ లోటును బీఆర్ఎస్ భర్తీ చేస్తుందని ఆశిస్తున్నా.
-ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్
కేసీఆర్ నాయకత్వంలో దేశానికే మాడల్ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ అభివృద్ధి ఫలాలను దేశ ప్రజలకు కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ నీటి వనరులను ఎలా వినియోగిస్తున్నారో.. సంక్షేమ పథకాలను ఏ విధంగా తెస్తున్నారో తెలుసుకొంటే దేశ ప్రజలు బీఆర్ఎస్ను తప్పకుండా స్వాగతిస్తారు.
-ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ర్టానికి పరిమితం కాకుండా జాతీయరాజకీయాల్లో ప్రవేశించేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం మంచి ప్రయత్నం. టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇందులోనూ కేంద్ర బిందువుగా ఉంటాయి. బీజేపీపై పోరాడేందుకు ప్రాంతీయపార్టీలు ఏకతాటిపైకి రావాలి. ఒంటరిగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారును సవాల్ చేసే పార్టీ ఏదీ ప్రస్తుతం దేశంలో లేదు.
-ప్రొఫెసర్ తిరుపతిరావు, చాన్స్‌లర్ మణిపూర్ యూనివర్సిటీ
ఇందిరాగాంధీ తర్వాత టీఆర్ఎస్ అధినేత దార్శనికత, అంకితభావంతో సరితూగే నేతగానీ, సీఎం గానీ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టిన దళితబంధు పథకాన్ని తెలంగాణలోని అన్నివర్గాలే కాకుండా బీజేపీ, కమ్యూనిస్టుల పాలనలోని రాష్ర్టాల ప్రజలూ స్వాగతిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీర్ ప్రవేశంపై పెద్దచర్చే నడుస్తున్నది.
-మల్లేపల్లి లక్ష్మయ్య, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
ప్రజల ఎజెండానే దేశం ఎజెండాగా అవతరించిన బీఆర్ఎస్కు అండగా నిలవాలి. జన ఆకాంక్షలను నెరవేర్చే దీర్ఘకాలిక సామాజిక ఉద్యమంగా బీఆర్ఎస్ ముందుకు సాగాలి. దేశ రాజకీయపటం మీద బీఆర్ఎస్ అత్యాధునిక సామాజిక విప్లవంగా ప్రభవించాలి. కేసీఆర్ విజయాలు సాధించాలని అందరం కోరుకుందాం. ఆయనకు అండగా నిలుద్దాం. ఈ దీర్ఘయాత్రలో కలిసి అడుగులు వేద్దాం.
-జూలూరి గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం. ఒకచోట సక్సెస్ అయినవారు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తే ఎక్కడైనా సక్సెస్ అవుతారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం సంతోషకరం. అలాంటి వారి సేవలు దేశానికి ఎంతో అవసరం. బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రానున్నది.
-డాక్టర్ భాస్కర్‌రావు, సీఎండీ కిమ్స్ హాస్పిటల్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వాన్ని దగ్గరుండి చూశాం. నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయేవాళ్లం. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించడం శుభపరిణామం. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలిపినట్టుగానే దేశాన్ని సైతం అభివృద్ధి పథంలో నడపాల్సి ఉన్నది.
– మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు
కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితికి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గతంలో బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిర్వహించిన సమాఖ్య సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తీర్మానాన్ని సైతం ఆమోదిం చాం. అఖిల భారత ఉద్యోగులంతా కేసీఆర్‌తోనే స్వర్ణభారత్ సాధ్యమని నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో అఖిల భారత ఉద్యోగులందరినీ కూడగట్టి కేసీఆర్ బాటలో నడిచి సత్తా చాటుతాం.
-మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు
బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి. తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతా విస్తరించాలి. దేశ రాజకీయ వ్యవస్థలో తిరుగులేని శక్తిగా నిలవాలి. భారతదేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. కేసీఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలి.
– వీ మమత, సత్యనారాయణ, టీజీవోస్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని స్వాగతిస్తున్నాం. వారికి మా శుభాకాంక్షలు. వారు తెలంగాణ అభివృద్ధికి, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషిచేస్తున్నారు. మా డిక్కీ సమావేశాలకు హాజరై ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పారు. బీఆర్ఎస్ ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నా.
-మిలింద్ కాంబ్లీ, వ్యవస్థాపక అధ్యక్షుడు, డిక్కీ