ఎన్ని కష్టాలెదురైనా ధర్మానిదే విజయం
ఎన్ని కష్టాలెదురైనా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది. సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే విజయదశమి స్ఫూర్తిని అమలుచేసిన వాళ్లమవుతం. -తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
- తెలంగాణ ఉద్యమంలో విజయ దశమి స్ఫూర్తి
- సంస్కృతి, సంప్రదాయాల్లో విజయ దశమికి ప్రత్యేక స్థానం
- రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎన్ని కష్టాలెదురైనా చివరికి ధర్మానిదే విజయమని, అదే విజయ దశమి స్ఫూర్తి అని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇదే స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. సామాన్య ప్రజలను అన్ని రంగాల్లో విజేతలుగా నిలబెట్టడం ద్వారానే దసరా స్ఫూర్తిని అమలుచేసిన వారమవుతామని స్పష్టంచేశారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
విజయానికి సంకేతంగా నిలిచిన జమ్మి వృక్షానికి పూజ చేయడం, శుభానికి సూచికగా పాలపిట్టను దర్శించుకోవడం, అలయ్ బలయ్‌తో పరస్పరం ప్రేమాభిమానాలను చాటుకోవడం, పవిత్రమైన జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం, పెద్దల పాదాలకు నమసరించి ఆశీర్వాదం తీసుకునే మహోన్నత సంస్కృతి, సంప్రదాయాన్ని దసరా పండుగ మనకు అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకున్న ప్రత్యేకత, విశిష్టతను గౌరవిస్తూ, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కొనసాగుతున్న కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగ శుభాలు, సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

