హైదరాబాద్ : తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో నిరాడంబరత, నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ప్రజల మనిషి నర్సింహా రెడ్డి అని, వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
భూదానోద్యమంలో తను వందలాది ఎకరాలను పేదలకు పంచిన నర్సింహా రెడ్డి, 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొని, మూసీ పరిరక్షణ, తెలంగాణకు గోదావరి నదీ జలాల కోసం కృషి చేశారని తెలిపారు. శోక తప్తులైన కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.