రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ) : కేసీఆర్ వీరాభిమాని(KCR Ardent Fan) తెలంగాణ సత్తెమ్మ (Telangana Sattemma)ఇక లేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన జిందం సత్తెమ్మ అలియాస్ తెలంగాణ సత్తెమ్మ (65) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కరీంనగర్ లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది.
కేసీఆర్‌కు వీరాభిమాని అయిన సత్తెమ్మ..కేటీఆర్ అంటే కూడా ఎనలేని ప్రేమ, అభిమానం చూపించేది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సత్తెమ్మ 2009 నుంచి కేటీఆర్ వెంటే నడిచింది. జిల్లాలో కేటీఆర్ పాల్గొన్న ప్రతి సభకు వచ్చి జై తెలంగాణ..జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేసి సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపేది. కాగా, సత్తెమ్మ గ్రామం మాధ్యమనేరులో ముపునకు గురైంది.
దీంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో డబుల్ బెడ్ రూం ఇచ్చి కేటీఆర్ అండగా నిలిచారు. సత్తెమ్మ కొడుకు మృతితో మనోవేదనతో ఆమె అనారోగ్యం బారిన పడింది. కరీంనగర్ దవాఖానాలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. సత్తెవ్వ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సత్తెమ్మ అంత్య క్రియలకు కేటీఆర్ హాజరు కానున్నారు.

కేటీఆర్‌తో సత్తెమ్మ..