హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందటం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
— KTR (@KTRBRS) October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Deeply saddened by the tragic news of a bus accident near Chinna Tekur village in Kurnool district.
My heartfelt condolences to the families who lost their loved ones. Praying for the speedy recovery of the injured.— Harish Rao Thanneeru (@BRSHarish) October 24, 2025