మీ తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టేస్తారా?
కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్‌షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్రం తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టివేస్తారా? అంటూ రాకేశ్‌రెడ్డిని స్థానికులు, రైల్వే కార్మికులు నిలదీశారు.
- 150 ఎకరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు ఇవ్వదా?
- బీజేపీ నేత రాకేశ్‌రెడ్డిని నిలదీసిన రైల్వే కార్మికులు
- కాజీపేట రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ కోసం పోరాట దీక్ష
- స్టేజీపైనే బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల బాహాబాహీ
కాజీపేట, ఏప్రిల్ 23: కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్‌షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ విషయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. కేంద్రం తప్పును రాష్ట్ర సర్కారుపై నెట్టివేస్తారా? అంటూ రాకేశ్‌రెడ్డిని స్థానికులు, రైల్వే కార్మికులు నిలదీశారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ వర్క్‌షాపు, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కాజీపేట చౌరస్తాలో ధర్మ పోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇచ్చిందని, మిగతా 10 ఎకరాల భూమి ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కావాలనే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము చాలాసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని, అందుకే శంకుస్థాపన జాప్యం అమవుతున్నదని అన్నారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు, రైల్వే కార్మికులు భగ్గుమన్నారు. 150 ఎకరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం 10 ఎకరాల భూమి ఇవ్వదా? అంటూ రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. రాష్ట్ర సర్కారుపై తప్పును నెట్టి మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? అంటూ మండిపడ్డారు.
దీంతో బీజేపీ వర్గీయులు, స్థానికులు, రైల్వే కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్‌కు శంకుస్థాపన చేయడం లేదని ఆరోపించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను దీక్షా శిబిరం నుంచి పక్కకు తప్పించారు. దీక్షను విరమించుకొంటున్నట్టు నిర్వాహకులు ప్రకటించడంతో పోలీసులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్, చైర్మన్ దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

