బంజారాహిల్స్, జూన్ 16: ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి, నాట్యగురు మంగళా భట్ (62) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంత కాలంగా హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. కథక్ నృత్యంలో దేశ, విదేశాల్లో అ నేక ప్రదర్శనలు ఇచ్చిన మంగళా భట్.. ప్ర ముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ సతీమణి. జానపద కళాబ్రహ్మ గోపాల్ రాజ్భట్కు కోడ లు. మంగళా భట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడ మీ పురస్కారా న్ని స్వీకరించారు. మంగళవారం జూబ్లీహి ల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ని ర్వహించనున్నట్టు తెలిపారు.