ఆత్మకూరు, ఫిబ్రవరి 5 : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షా కేంద్రంలో కస్తూర్బా గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వొకేషనల్ గ్రూప్లో ఎంఎల్టీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రాక్టికల్స్ పరీక్షకు హాజరయ్యారు. గంటన్నర తర్వాత పరీక్ష రాస్తుండగా వాంతులు చేసుకోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ వారిని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఒకరిని వనపర్తి జిల్లా దవాఖానకు సిఫారసు చేయగా.. మరొకరికి స్థానికంగా వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య విద్యార్థులను పరామర్శించారు. విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కావడంతోనే అస్వస్థతకు గురైనట్లు పలువురు ఆరోపించారు.