Karthika Masam | కార్తికమాసం తొలి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ
కార్తికమాసం (Karthika Masam) తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి.
హైదరాబాద్: కార్తికమాసం (Karthika Masam) తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో కృష్ణా, గోదావరి తీరాల్లో సందడి నెలకొంది. ప్రముఖ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో రద్దీ నెలకొంది. రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి ఆ ముక్కంటి కృపాకటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. కార్తిక మాసం మొదటి సోమవారం కావండతో రెండుసార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు. తెల్లవారుజామునుండే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో ఆది దంపతుల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వాడపల్లిలోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంతో పాటు పిల్లలమర్రి, మేళ్లచెరువు శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

భద్రాచలంలోని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీఆర్పురం శివాలయం, నాచారంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో అభిషేకాలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. ఆ గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

