Karne Prabhakar | విచారణ పేరిట రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేసులో పస లేకున్నా ధారావాహిక సీరియల్లా నడిపిస్తున్నారని చెప్పారు. 15 ఏళ్లుగా కేసీఆర్ ఎర్రవల్లిలోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. అయినప్పటికీ నందినగర్ ఇంటికి సిట్ నోటీసులు అంటించడాన్ని తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్కు చట్టాలంటే గౌరవం ఉన్నందునే విచారణకు హాజరవుతున్నారని కర్నె ప్రభాకర్ తెలిపారు. కానీ కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని, అమానవీయమని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టు దుర్మార్గమని విమర్శించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలో పోలీసు ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.