శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 15:24:57

కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం హర్షణీయం

కవితకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం హర్షణీయం

హైదరాబాద్‌ : మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడం హర్షణీయమని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీలో కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవిత అభ్యర్థిత్వం విషయంలో రెండో మాటలేదు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీలో అందరం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మంచి నిర్ణయం తీసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కవిత కీలకపాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఉద్యమకారిణిగానే ఆమె 2014లో నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ సాధించి గెలిచారన్నారు. ఎంపీగా గెలుపొంది నిజామాబాద్‌కు అనేక సేవలందించారన్నారు. గడిచిన సారత్రిక ఎన్నికల్లో కవిత ఓటమి పట్ల ప్రజలు, తమ పార్టీ నేతలు చాలా బాధపడ్డారన్నారు.


logo