Congress Govt | రెండు వేర్వేరు రాష్ర్టాల్లో రెండు కొత్త నగరాల నిర్మాణం జరుగుతున్నదంటే ఒకటో, రెండో పోలికలు కనిపిస్తాయి. అయితే బెంగళూరులోని ‘క్విన్’ సిటీ, హైదరాబాద్‌లోని ‘ఫోర్త్’ సిటీ నిర్మాణంలో దాదాపు అన్ని విషయాలూ అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ప్రాంతం, ప్రధాన నగరానికి దూరం, కనెక్టివిటీ, మౌలిక వసతులు.. అన్నీ సేమ్ టు సేమ్!! రెండు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ కొత్త సిటీకి ఒకే బూ ్లప్రింట్ !డిజైన్‌తోపాటు వివాదాలూ సేమ్.. భూదందా ఆరోపణలూ డిటో!పక్కపక్కనే ఉండే రాష్ర్టాలవి.దేశ జీడీపీలో వాటిదే అగ్రస్థానం.రెండింట్లోనూ కాంగ్రెస్‌దే అధికారం.ఇంకేముంది..?!ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల కన్ను వీటిపై పడింది.ఏ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సూట్‌కేసులు రావాలి.చిన్న ప్రాజెక్టులతో ముట్టేది కొంతే.. అందుకే భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావాలి.అందుకే.. ఏకంగా కొత్త సిటీనే నిర్మిస్తే అయిపోలా?? అనుకొన్నారు
పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు..! ఆలోచన వచ్చిందే తడువుగా.. తొలుత అధికారంలోకి వచ్చిన కర్ణాటక సీఎంకు మతలబు అందించారు. అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయమని ఇక్కడా ఆదేశించారు.అధిష్ఠానం ఆదేశాలతో.. కర్ణాటకలో ‘క్విన్’ సిటీకి, తెలంగాణలో ‘ఫోర్త్’ సిటీకి అంకురార్పణ జరిగింది.ఇక్కడ మరో గమ్మత్తైన విషయమేంటంటే.. రెండు సిటీలకు ఒకటే బ్లూప్రింట్..! అదీ అధిష్ఠానం డైరెక్షన్లోనే..!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) బెంగళూరు, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రాజధాని బెంగళూరు శివారుల్లో క్విన్ సిటీ (నాలెడ్జ్, వెల్బీయింగ్ అండ్ ఇన్నోవేషన్ సిటీ) పేరిట సిద్ధరామయ్య సర్కారు గురువారం కొత్త నగరానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు ఉత్తరదిశగా ఉన్న దొడ్డబల్లాపూర్ ప్రాంతాల్లో 5,800 ఎకరాల విస్తీర్ణంలో ఈ సిటీని నిర్మించనున్నారు. ‘క్విన్ సిటీతో రాష్ర్టాభివృద్ధితో పాటు, పరిశ్రమలకు కావాల్సిన కొత్త పరిశోధనలకు ఊతం లభిస్తుంది. ఏఐ, బయోటెక్నాలజీ తదితర వినూత్న రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయి’ అని సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో భాగంగా వచ్చే మూడేండ్లలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో సిటీ నిర్మాణాన్ని చేపడుతామని చెప్పారు.
ఆ సిటీని రద్దు చేసి..
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్విన్ సిటీ పేరిట పెద్దఎత్తున భూ పందేరానికి తెగబడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఇదే ప్రాంతంలో హెల్త్ సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసినట్టు గుర్తు చేశారు. దీంతో ‘హెల్త్ సిటీ’ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న దబాస్పేట, దొడ్డబల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పడిపోయిందని, ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు చవగ్గా మెజారిటీ భూములను కొనుగోలు చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది జరిగిన ఆరునెలలకు మళ్లీ ‘క్విన్’ సిటీ పేరిట ప్రభుత్వం ప్రకటన వెలువరించిందని, దీంతో భూముల ధరలు అమాంతం పెరిగాయని మండిపడ్డారు. అంతిమంగా తామే నష్టపోయామని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతంలో ‘ఖిర్’ సిటీ (నాలెడ్జ్, హెల్త్, ఇన్నోవేషన్, రీసెర్చ్ సిటీ) పేరిట ప్రతిపాదనలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే, ఆ పేరునే తాము ‘క్విన్’ సిటీగా మార్చామని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
ఒకేవిధంగా నిర్మాణాలు
బెంగళూరు శివారుల్లో నిర్మిస్తున్న ‘క్విన్’ సిటీని అనుకరిస్తూనే హైదరాబాద్ శివారుల్లో ‘ఫోర్త్’ సిటీ నిర్మాణ ప్రతిపాదనలు చేశారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బెంగళూరు ప్రధాన నగరానికి 56 కిలోమీటర్ల దూరంలోని దొడ్డబల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో క్విన్ సిటీని ప్రతిపాదించగా, హైదరాబాద్‌కు 57 కిలోమీటర్ల దూరంలో కందకూరు సమీపంలో ‘ఫోర్త్’ సిటీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బెంగళూరు నగరంలోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు ‘క్విన్’ సిటీ 33 కిలోమీటర్ల దూరంలో ఉంటే, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘ఫోర్త్’ సిటీ 37 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ‘క్విన్’ సిటీకి మెట్రో, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను రవాణా సదుపాయాలుగా ప్రతిపాదించగా, ‘ఫోర్త్’ సిటీకి కూడా మెట్రో, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లనే సెలెక్ట్ చేశారు. ఈ రెండు సిటీల్లోనూ ఏఐ వర్సిటీ కామన్‌గా ఉండటం గమనార్హం. ‘క్విన్’ సిటీ కోసం దబాస్పేట, దొడ్డబల్లాపూర్ మధ్య ఏర్పాటు చేయబోతున్న శాటిలైట్ ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చినట్టే, హైదరాబాద్ చుట్టూరా నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్‌మెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పెంచారు. కర్ణాటకలో ‘హెల్త్’ సిటీని రద్దు చేసి ‘క్విన్’ సిటీని తీసుకొస్తున్నట్టే.. ఇక్కడ ‘ఫార్మా’ సిటీని రద్దు చేసి ‘ఫోర్త్’ సిటీని తీసుకొస్తున్నారు.
కొత్త సిటీల నిర్మాణాలు ఎందుకు?
కొద్దిరోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చేఏడాది ఢిల్లీ, బీహార్‌లో, ఆ మరుసటి ఏడాది బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మినహా మరేఇతర రాష్ట్రంలో సొంతంగా అధికారంలో లేదు. హిమాచల్ ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ రాబడులు అంతంత మాత్రమే. దీంతో తలసరి ఆదాయంలో, పారిశ్రామిక ప్రగతి, జీఎస్డీపీలో స్వావలంబన సాధించిన తెలంగాణ, కర్ణాటకను కాంగ్రెస్ అధిష్ఠానం బంగారుబాతులుగా మార్చుకొన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. చిన్న ప్రాజెక్టులతో పోలిస్తే, భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఆర్థికలబ్ధి ఉంటుందని భావించిన ఢిల్లీ పెద్దలు.. తొలుత కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కొత్త సిటీల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
అది ఉత్తరం.. ఇది దక్షిణం అందుకే!
బెంగళూరుకు ‘క్విన్’ సిటీ ఉత్తర దిశగా ఉన్నట్టే, హైదరాబాద్‌కు కూడా ‘ఫోర్త్’ సిటీని ఉత్తర దిశగానే నిర్మించాలని తొలుత ఢిల్లీ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆదేశాలు ఇచ్చారట. హైదరాబాద్‌కు ఉత్తరాన కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాల్లోని మెజారిటీ భూములు రక్షణశాఖ ఆధీనంలో ఉన్నట్టు రాష్ట్ర నాయకులు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఉత్తరాన కొత్త సిటీ ప్రతిపాదనను పక్కనబెట్టిన అధిష్ఠానం.. పశ్చిమాన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తూర్పున ఉప్పల్ పారిశ్రామికవాడ ఉండటంతో.. దక్షిణ భాగంలోని కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడ ప్రాంతంలో ‘ఫోర్త్’ సిటీ కోసం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు భోగట్టా.
రెండు సిటీల్లోనూ పెద్ద స్కామ్
‘క్విన్’ సిటీ నిర్మాణం చేపడుతున్నామని కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు దబాస్పేట, దొడ్డబల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భూమాయాజాలానికి తెగబడుతున్నారు. రైతుల నుంచి అప్పటికే అగ్గువకు సొంతం చేసుకొన్న విలువైన భూముల్లో క్రయవిక్రయాలు, నిర్మాణాలు జరిపి వేలకోట్లు దండుకొంటున్నారు. ఇక, ‘ఫోర్త్’ సిటీ నిర్మాణం పేరిట హైదరాబాద్ శివారుల్లోని కందుకూరు, మచ్చర్ల, తుక్కుగూడ మొదలు యాచారం వరకూ వేలకోట్ల విలువైన భూదందా కొనసాగుతున్నది. ‘ఫ్యూచర్’ పేరిట ఇన్సైడ్ ట్రేడింగ్ నిత్యకృత్యంగా మారింది. ప్రతీరోజూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
బ్లూప్రింట్ కాకపోతే మరేంటి?