DK Shivakumar | రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదన్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. కరెంటుపై మరోసారి కాంగ్రెస్ కుట్ర బట్టబయలు..
DK Shivakumar | కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్తీర్ణాన్ని బట్టి 5 గంటలు, 6 గంటలు, ఆఖరికి 7 గంటల కరెంటు సరిపోతదని, అంతకుమించి అవసరమే లేదని ఓ తలాతోక లేని స్టేట్మెంట్ ఇచ్చారు.
బెంగళూరు: కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్తీర్ణాన్ని బట్టి 5 గంటలు, 6 గంటలు, ఆఖరికి 7 గంటల కరెంటు సరిపోతదని, అంతకుమించి అవసరమే లేదని ఓ తలాతోక లేని స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులందరికీ 24 గంటల కరెంటు ఇవ్వాల్సిన అవసరమే లేదని అనాలోచితంగా మాట్లాడారు.
కాగా, కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కరెంటుపై తెలివి తక్కువ వాదనే చేశారు. రైతులకు మూడు గంటల కరెంటే చాలన్నారు. మోటార్లకు 10 హెచ్పీ మీటర్లు పెట్టుకుంటే గంటకు ఎకరం చొప్పున పారుతుందని, మూడు గంటల కరెంటు సరిపోతుందన్నారు.
కాగా, కాంగ్రెస్ నేతల మతిలేని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కాటగలిసినట్టేనని డీకే శివకుమార్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని విమర్శలు గుప్పిస్తున్నారు. సరిపడా కరెంటు ఇవ్వకుండా వ్యవసాయాన్ని దండగగా మార్చి, రైతుబంధును ఎత్తేయాలనేది కాంగ్రెస్ కుట్రలా కనిపిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

