హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున తెలంగాణ బిడ్డ బరిలోకి దిగుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌నాగరాజు ‘నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్’ నుంచి పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు పార్టీ ప్రకటించింది. బౌండరీ కమిషన్ సిఫారసుల మేరకు బ్రిటన్‌లో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టోరల్ కాల్యులస్ ప్రకారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్‌పార్టీ సొంతం కాబోతున్నదని అంచనా వేసింది. బ్రిటన్‌లో నూ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఇదే ఏడాది అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యు ద్ధం, ఇజ్రాయిల్-పాలస్తీనా ఘర్షణ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్, అమెరికా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తినెలకొన్నది.
అంచెలంచెలుగా ఎదిగిన ఉదయ్
సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్‌నాగరాజు జన్మించారు. హన్మంతరావు, నిర్మలాదర్ ఆయన తల్లిదండ్రులు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో ఉదయ్ పీజీ చేశారు. సమాజం, భావితరాలపై ఆర్టిఫిషిల్ ఇంటలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన ఏఐ పాలన్ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‌ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా ఉదయ్ మంచి పేరు తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆయనకు మంచి పట్టు ఉన్నది. సూల్ గవర్నర్‌గా, వలంటీర్‌గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా పేరుంది. దశాబ్దం ఇంటింటి ప్రచారంతో సామాన్యుల కష్టాలపై అవగాహన సాధించారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవాకాశాలున్నాయని సర్వే సంస్థలు తేల్చాయి. ఈ నెలలో జరిగిన కౌన్సిలర్, స్టేట్స్ మేయర్ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఉదయ్ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయ నున్న ఉదయ్నాగరాజుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.