కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
బతుకమ్మ ఆటపాటలు, చిడతల కోలాటంతో నిరసన.. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ రహదారిపై భారీ ధర్నా.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా పలువురి అరెస్టు, ఉద్రిక్తత
కరీంనగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కోతలపై కరీంనగర్ రూరల్ మండల రైతులు రోడ్డెక్కారు. ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దుర్శేడ్‌లోని గోపాల్పూర్ చౌరస్తాలో రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. ఎండిన పంటలు, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లను ప్రదర్శించి నిరసన తెలిపారు. కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో మహిళా రైతులు బతుకమ్మ ఆడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిడతల కోలాటంతో గంటన్నరకుపైగా రాస్తారోకో చేశారు.
నిరసనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోగా, పోలీసులు శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. వినకపోవడంతో గంగుల కమలాకర్‌తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. గంగుల అరెస్ట్ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కార్యకర్తలను నెట్టేసిన పోలీసులు గంగులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన గంగులతోపాటు మిగతా వారిని వదిలి పెట్టాలని ఆ తర్వాత రైతులు, బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ కోతలతో పంటలు ఎండుతుండటంతో రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఎల్ నినోపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కోతలపై రాజీవ్ రహదారిని దిగ్బంధించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా ఎలా చేయగలిగామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేక పోతున్నదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఉయ్యాలో..
మా బతుకులే ఆగమయ్యే ఉయ్యాలో..
రామరామ రామ ఉయ్యాలో.. కేసీఆర్
ఉన్నప్పుడే మా బతుకు పచ్చగుండె ఉయ్యాలో..
ఇంటింటికీ నీళ్లచ్చే ఉయ్యాలో..
చేలల్లో నీళ్లు పారేది ఉయ్యాలో..
ప్రాజెక్ట్ పుట్టింది ఉయ్యాలో..
రైతుబంధు అచ్చేది ఉయ్యాలో..
అవ్వలు మురిసేది ఉయ్యాలో..
తాతలు నవ్వేది ఉయ్యాలో..
కాంగ్రెస్ పాలనలో ఉయ్యాలో..
మా బతుకులే ఆగమయ్యే ఉయ్యాలో..
రైతుబంధు లేదాయే ఉయ్యాలో..
కరెంట్ కష్టాలే వచ్చెనే ఉయ్యాలో..
పంటలెండుతుండనే ఉయ్యాలో..
చెరువులో నీళ్లు లేని
రోజులు తెచ్చే ఉయ్యాలో..
నీళ్లు లేని చెర్లల్ల నిన్నెట్ల
విడువాలెనే ఉయ్యాలో..
పచ్చని రాష్ర్టాన్ని పగబట్టిన్రే ఉయ్యాలో..
దొంగ చేతికి తాళము ఇచ్చిరే ఉయ్యాలో.. రాష్ర్టాన్ని దోచుకుంటుండే ఉయ్యాలో..
మా గుండెలు తల్లడిల్లెనే ఉయ్యాలో..
కేసీఆర్ మాటను వినకపోతిమే ఉయ్యాలో..
కరెంటు కష్టాలు వచ్చెనే ఉయ్యాలో..
మా పంటకు నీరు లేదే ఉయ్యాలో..
మా బతుకులు భారమయ్యే ఉయ్యాలో…
పాటలేమని పాడాలె ఉయ్యాలో..
బతుకమ్మ ఆటలెట్ట ఆడాలె ఉయ్యాలో..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

