హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం తిరిగి నియమించింది. సర్వీసును మరో రెండేండ్లు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో ఓఎస్డీగా నియమించడంతోపాటు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్‌ను వెంటనే సీఎస్‌కు రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పింది. ‘ఇద్దరు ఐజీలకు పదవీకాలం పొడిగింపు?’ పేరిట మంగళవారం కథనాన్ని ప్రచురించింది.