న్యూఢిల్లీ, ఆగస్టు 28: కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.287.51 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నది. మిస్సైల్ సిస్టమ్స్‌ను సరఫరా చేయనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో కంపెనీ తెలియజేసింది.
కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ), ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ జాయింట్ వెంచరే ఈ కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాగా, రాబోయే ఏడాదికిపైగా కాలంలో ఈ ఆర్డర్‌కు సంబంధించిన లావాదేవీలు సాగనున్నాయి.