వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 7: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయుష్ పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. దీని ఆధారంగా పీజీ ఆయుర్వేదం, హోమియో, యునాని కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో బుధవారం ఉదయం 9 నుంచి గురువారం సాయంత్రం 6 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.