హనుమకొండ, సెప్టెంబర్ 7: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భం గా ఈ నెల 9న రాష్ట్ర స్థాయి ఉత్సవాలను వరంగల్‌లోని హరిత హోటల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రకటించారు. గురువారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో సంస్థ చైర్మ న్ సంగంరెడ్డి సుందర్రాజు యాద వ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన కాళోజీకి రాష్ట్రం ఏర్పాటయ్యాక గొప్ప ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు.
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రఖ్యాత కళాకారులకు కాళోజీ పేరిట అవార్డులు అందిస్తున్నదని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, ఈ నెల 9న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కళాక్షేత్రం ప్రారంభించాలని అనుకున్నప్పటి కీ.. భారీ వర్షాలు కురుస్తాయని వా తావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం లో.. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తామని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ చెప్పారు.