KNRUHS | వరంగల్ : కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వరంగల్లోని కాళోజీ యూనివర్సిటీ తొలి విడుత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ప్రకటనను కాళోజీ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది.
మరోవైపు యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు సైతం వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం www.knruhs.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.