జయశంకర్ భూపాలపల్లి : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసు భక్షుడిగా మారాడు. తోటి ఉద్యోగినిపై(Head conistable) సదరు పోలీస్ అధికారి లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లాలోని కాళేశ్వరం (Kaleswaram) ఎస్ఐ భవానీ సేన్‌ను(SI Bhawani Sen) పోలీసులు అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్ రమపై లైంగిక దాడికి పాల్పడంతో బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి డీఎస్పీ కాళేశ్వరం ఠాణాలో విచారణ చేపట్టారు. అర్ధరాత్రి దాటాక విచా రణ ముగియ డంతో ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ భవానీ సేన్ పై లైంగికదాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కాగా, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శీనుబాబు అండతో ఎస్ఐ రెచ్చిపోతూ పలు అవినీతి, అక్రమా లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పని చేసిన ప్రతి చోటా ఇలాంటి ఆరోపణలు ఎదు ర్కొంటున్నాడని విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.