e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home Top Slides అదో సైన్స్‌ అద్భుతం

అదో సైన్స్‌ అద్భుతం

  • గొప్ప ప్రాజెక్టును ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం
  • మూడేండ్లపాటు ప్రాజెక్టులో భాగస్వామినయ్యా
  • పోస్ట్‌ ప్రొడక్షన్‌కు ఏడాది పట్టింది
  • ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ దర్శకుడు రాజేంద్ర శ్రీవత్స

‘కాళేశ్వరం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇంజినీరింగ్‌ అద్భుతం. దీని వెనుక గొప్ప సైన్స్‌ ఉన్నది. గొప్ప విజన్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు కొన్ని తరాలవరకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది’

-కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స, దర్శకుడు, ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’

- Advertisement -

హైదరాబాద్‌, జూన్‌ 24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి ఇప్పటికే విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా.. అతి తక్కువ సమయంలో పూర్తయిన భారీ నిర్మాణంగా రికార్డులకెక్కింది. డిజైనింగ్‌ నుంచి చివరి నిర్మాణం వరకు ప్రతి దశలో గొప్ప సైన్స్‌ దాగున్నది. ఒక నదిని ఎత్తిపోసి.. కొత్త నదిని సృష్టించే శక్తి దీని సొంతం. మెగా నిర్మాణాల్లో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే ఎన్నో అంశాలు కాళేశ్వరంలో ఉన్నాయి. ఇవన్నీ ఓ డాక్యుమెంటరీ రూపంలో శుక్రవారం ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. ‘లిఫ్టింగ్‌ ఏ రివర్‌’ పేరుతో డిస్కవరీ చానల్‌లో ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీకి దర్శకుడు ‘కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స’. ఆయన మన హైదరాబాదీ కావడం విశేషం. 2017లో ప్రారంభించి మూడేండ్లకుపైగా శ్రమించి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఆయన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఈ విశేషాలు ఆయన మాటల్లోనే..

న్యూస్‌పేపర్‌లో చూసి ఆశ్చర్యపోయా

నాది హైదరాబాదే.. వృత్తిరీత్యా ఢిల్లీలో ఉంటా. 2017లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పేపర్‌లో కాళేశ్వరం గురించి చదివాను. నది నీళ్లను 150 మీటర్లు ఎత్తిపోస్తున్నారని తెలిసి ‘నా రాష్ట్రంలో ఇంతపెద్ద ప్రాజెక్టు కడుతున్నారా?’ అని ఆశ్చర్యపోయా. మా ఇంట్లో ఓసారి మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ‘నీళ్లు రావడం నిజం.. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి?’ అనే విషయం ఆమెకు పెద్దగా తెలియదని అర్థమైంది. దీంతో అన్నివర్గాల ప్రజలకు అర్థమయ్యేలా డాక్యుమెంటరీ తీయాలకున్నా. ప్రాజెక్టు గురించి లోతుగా సమాచారం సేకరిస్తే గొప్ప ఇంజినీరింగ్‌కు, సైన్స్‌కు ఉదాహరణగా అనిపించింది. సాధారణంగా ప్రాజెక్టులు ఒకేచోట కడుతుంటారు. కానీ కాళేశ్వరం కొన్ని వందల కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీంతో ప్రాజెక్టును కొత్తకోణంలో ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇది జీవితకాల అనుభవం.

మాకు ప్రతీది ఆశ్చర్యమే

నిర్మాణ సమయంలో వందల మంది కార్మికులు, ఇంజినీర్లు, సిబ్బందితో మాట్లాడాం. ‘చరిత్రాత్మక నిర్మాణంలో భాగస్వామిని అవుతున్నందుకు గర్వంగా ఉన్నది’ అనే భావన, అంకితభావం వారిలో కనిపించింది. ఇలాంటిది అరుదు. ఇంజినీరింగ్‌ పరంగా ప్రాజెక్టు స్వరూపం, బిగించిన మోటార్లు, డ్యామ్‌లు, కాలువలు.. ఇలా ప్రతిదీ కొత్తదే. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదు కాబట్టి అనుకరణకు (రిఫరెన్స్‌) అవకాశం లేదు. మాకు ప్రతి దశ పజిల్‌ మాదిరిగా కనిపించేది. కానీ ఇంజినీర్లు, సిబ్బంది ప్రతి సవాల్‌ను కొత్తగా స్వీకరించి, ఇంజినీరింగ్‌, సైన్స్‌ ద్వారా పరిష్కరించుకున్న విధానం చూసి ఆశ్చర్యం కలిగేది. అతితక్కువ సమయంలో మా కండ్లముందే నిర్మాణాలు అతి వేగంగా జరిగాయి. ఇది రికార్డులపరంగానే కాదు.. సైన్స్‌పరంగా కొన్ని తరాలవరకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

సీఎం కేసీఆర్‌ది గొప్ప విజన్‌

సీఎం కేసీఆర్‌ మేడిగడ్డకు వచ్చినప్పుడు మేము డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆయన విజన్‌ గొప్పది. ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం, అతి తక్కువ సమయంలో పూర్తిచేసేలా పర్యవేక్షించడం గొప్ప విషయం. ఆయన నేతృత్వంలోని బృందం అహోరాత్రులు శ్రమించింది.

వందల గంటల ఫుటేజీ

మా షూటింగ్‌ పూర్తయ్యేసరికి వందల గం టల ఫుటేజీ చేరింది. దానిని మా బృందం పరిశీలించి తుదిరూపు ఇవ్వడానికి ఏడాది పట్టిం ది. వీక్షకులకు ప్రాజెక్టును సందర్శించిన అనుభూతి కల్పించేందుకు సౌండ్‌ రికార్డిస్ట్‌ పీడీ వాల్సన్‌ శబ్దాలన్నింటినీ ‘లైవ్‌ రికార్డింగ్‌’ చేశా రు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ ప్రశాంత్‌ కారంత్‌, స్క్రిప్ట్‌ రైటర్‌ పూర్ణిమారావు.. ఇలా ఈ డాక్యుమెంటరీ వెనుక ప్రతి ఒక్కరి శ్రమ ఉన్నది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement