హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరీవాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల అవసరాలను తీర్చగలుతున్నామని శుక్రవారం మంత్రి ట్వీట్ చేశారు. లక్ష్మి బరాజ్ వద్ద గోదావరి నది 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మసాగర్ వరకు 10 పంపింగ్ స్టేష న్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నామని చెప్పారు. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, ఎస్సారెస్పీలోకి పంపింగ్ చేస్తున్నామని వివరించారు.