ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత
కరువు మండలాన్ని సిరుల కల్పవల్లిగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం ఇదిగో.. అంటూ ప్రస్తుతం దంచికొడుతున్న ఎండల్లోనూ కాళేశ్వరం జలాలతో అలుగులు దుంకుతున్నాయి. ఓవైపు ఎల్ నినో ప్రభావంతో ప్రపంచమంతా కరువు కోరలు చాచుతుండగా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో పెద్ద చెరువు (పెచ్చెరువు), చిన్న చెరువు (చించెరువు) వరద కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలతో అలుగులు పారుతూ కింది చెరువులకు పరుగులు పెడుతున్నాయి.
- కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
రామడుగు, అక్టోబర్ 15 : కరువు మండలాన్ని సిరుల కల్పవల్లిగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం ఇదిగో.. అంటూ ప్రస్తుతం దంచికొడుతున్న ఎండల్లోనూ కాళేశ్వరం జలాలతో అలుగులు దుంకుతున్నాయి. ఓవైపు ఎల్ నినో ప్రభావంతో ప్రపంచమంతా కరువు కోరలు చాచుతుండగా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో పెద్ద చెరువు (పెచ్చెరువు), చిన్న చెరువు (చించెరువు) వరద కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలతో అలుగులు పారుతూ కింది చెరువులకు పరుగులు పెడుతున్నాయి.
ఇటీవల రైతుల దీనస్థితిని గ్రహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ ద్వారా వరద కాలువ నుంచి శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) జలాశయానికి తరలించారు. గత ప్రభుత్వం గంగాధర మండలం తాడిజెర్రి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటుచేసి గట్టుబూత్కూర్ చెరువును నింపి గొలుసుకట్టు ద్వారా రామడుగు మండలం వెలిచాల పెద్ద చెరువు, చిన్న చెరువును కూడా నీటితో నింపేది. అక్కడి నుంచి మత్తడి ద్వారా కొత్తపల్లి చెరవుకు చేరుకునేవి. తాజాగా వరదకాలువ ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలతో గట్టుభూత్కూర్తోపాటు వెలిచాలలోని రెండు చెరువులు, కొత్తపల్లి చెరువులు నెలరోజులుగా అలుగులు దుంకుతున్నాయి. ఇది కేసీఆర్ సార్ పుణ్యమేనంటూ ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

