వరంగల్ : ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవం ఈ నెల 25వ తేదీన క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందని యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని వీసీ పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు(ఎస్సీఆర్బీ) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ఆచార్య సందీప్ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. 22వ స్నాతకోత్సవంలో 56 పీహెచ్డీ డిగ్రీలను అందజేయనున్నట్లు ప్రకటించారు. బంగారు పతకాలు తీసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు.