హనుమకొండ, అక్టోబర్ 23 : కాకతీయుల కళా వైభవం ఎంతో అద్భుతమని ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు అరవింద్‌కుమార్, విశ్వజిత్ ఖన్నా కొనియాడారు. వరంగల్ కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని వీక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ అరవింద్ కుమార్ దంపతులు, పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ విశ్వజిత్ ఖన్నా దంపతులు గురువారం ఓరుగల్లుకు వచ్చారు.
హనుమకొండ నకలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వద్ద వారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, హన్మకొండ కలెక్టర్ స్నేహాశబరీశ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. తొలుత వారు హన్మకొండలోని వేయి స్తంభాలగుడి, భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాకతీయుల కళా వైభవం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.