హనుమకొండ, మార్చి 9: కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ ప్రాంతంలోని అగ్గలయ్యగుట్ట సమీపంలోని కాకతీయ తోరణ ద్వారాన్ని పరిరక్షించాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్‌కు చెందిన పరిశోధకుడు అరవింద్ ఆర్యతో కలిసి ఆయన ఆదివారం హనుమకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ అగ్గలయ్యగుట్ట సమీపంలోని ఈ తోరణం రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. హనుమకొండ పద్మాక్షిగుట్ట వద్ద ఏర్పాటుచేసిన మొదటి దశ తోరణం వరంగల్ కోటలోని కాకతీయ కీర్తి తోరణ ద్వారాల కన్న ఎంతో ప్రాచీనమైనదని శివనాగిరెడ్డి తెలిపారు.