హైదరాబాద్, అక్టోబర్ 4 (నమ స్తే తెలంగాణ): పేదల హృదయాల్లో దీపమై వెలిగిన మహనీయుడు కాకా(జి.వెంకటస్వామి) అని సీఎం ఎ.రేవంత్రెడ్డి అన్నారు. శనివారం జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, సేవలందించారని, సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో కాకా అలుపెరుగని పోరాటం చేశారని, 1969లో తెలంగాణ కోసం జైలు కెళ్లాడని సీఎం అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 338 దరఖాస్తులు అందాయి. గృహనిర్మాణ శాఖకు 79, రెవెన్యూ సమస్యలపై 52, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 35, విద్యుత్తు సమస్యలపై 35, ఎస్సీ సంక్షేమ శాఖకు 29, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు సంబంధించి 104 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులను స్వీకరించారు.