స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 20: ‘ఇవే నాకు చివరి ఎన్నికలు.. మళ్లీ పోటీ చేయనని గతంలో చెప్పాను.. మళ్లీ చెబుతున్నా’ అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టంచేశారు. శనివారం ఆయన స్టేషన్‌ఘన్‌పూర్ రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకసార్లు చెప్పాను.. మళ్లీ చెబుతున్నా.. ఇవే నా చివరి ఎన్నికలు.. నేను మళ్లీ పోటీ చే యనని పేర్కొన్నారు.