కోహెడ, అక్టోబర్ 26 : బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని పౌర, ఆదివాసీ హక్కులు, పూర్వ విప్లవ విద్యార్థులు, భారత ప్రజాన్యాయవాదులు, ప్రగతిశీల మహిళా సంఘాలు, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్, పీస్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కడారి సత్యనారాయణరెడ్డి, ఖాతా రాంచంద్రారెడ్డి సంస్మరణ సభకు వారు హాజరై మాట్లాడారు.
బస్తర్ ప్రాంతంలో విప్లవ పోరాటం అణిచివేస్తే ఆగదని, ఉద్యమిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలకు అండగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన కడారి సత్యనారాయణరెడ్డి, ఖాతా రాంచంద్రారెడ్డికి జోహార్లు అర్పించారు. ఛత్తీస్గఢ్లో అపార ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్ట్టేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు.