హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హిందీ సాహిత్య సేవకు అందజేసే కబీర్ కోహినూర్ సమ్మాన్ అవార్డుకు హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు వీఎన్వీ పద్మావతి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. లాల్‌బజార్ తిరుమలగిరిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా ఆమె పనిచేస్తున్నారు. 23
ఏండ్లుగా హిందీ టీచర్‌గా పనిచేస్తున్న పద్మావతి హిందీలో 100 శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తూ వస్తున్నారు. గతంలో ఆమె ప్రేమ్‌చంద్ సాహిత్యరత్న, అంతర్జాతీయ మహిళా సమ్మాన్, నేపాల్ నోబుల్ టాలెంట్, ది ఎక్స్‌ప్లోరింగ్ మైండ్స్ అవార్డులను అందుకున్నారు.