హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు నందినగర్‌లో కేటీఆర్‌ను కలసి వారి సమస్యలను వివరించారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం ద్వారానే ఆ సమస్యకు పరిషారం లభిస్తుందని వారు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాల్లో 9,024 పోస్టుల్లో డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం, చాలామందికి ఒకటి కంటే ఎకువ ఉద్యోగాలు రావడం వల్ల సెకండ్ మెరిట్లో ఉన్న వారికి నష్టం జరుగుతున్నదని వివరించారు.
గురుకులాల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యరులతో భర్తీ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జీవో-81పై హైకోర్టు ఐదు మభ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం ఆయా ఉత్తర్వులను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీఎస్‌ఎల్ నిర్వహించిన వివిధ నోటిఫికేషన్లలో ప్రస్తుతం భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు నిరుద్యోగులు నష్టపోకుండా చూడటం కోసం జీవో-81 అమలు చేయకుండా వన్‌టైం రిలాక్సేషన్ (సడలింపు) కల్పించి పోస్ట్ మిగిలిపోకుండా డౌన్మెరిట్ ఆపరేట్ చేసి తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశారని గుర్తుచేశారు.
సీఎస్‌కు కేటీఆర్ ఫోన్
గురుకుల అభ్యర్థులు పేర్కొన్న అంశాలను, వారి అభిప్రాయాలను సావధానంగా విన్న తరువాత ఈ విషయంలో వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కేటీఆర్ కోరారు. గురుకుల, డీఎస్సీ అభ్యర్థుల పక్షాన ఆయన సీఎస్‌తో ఫోన్లో మాట్లాడారు. గతంలో అనుసరించిన విధానాన్ని అమలుచేసి అభ్యర్థులకు న్యాయం చేసే అన్ని అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కేటీఆర్‌కు గురుకుల అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్‌ను కలిసినవారిలో గురుకుల నిరుద్యోగ విద్యార్థులు రత్నశేఖర్‌రెడ్డి, స్వాతి, నిరుద్యోగ విద్యార్థులు దామోదర్‌రెడ్డి, విక్రమ్‌తోపాటు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.