హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్‌గా ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. కేం ద్ర జలశక్తి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీఆర్ఎంబీ చైర్మన్‌గా ముకేశ్ కుమార్ సిన్హా ఉండగా, ఇటీవలే ఆయన కేంద్ర జల సంఘం చైర్మన్‌గా నియమితులై బదిలీపై వెళ్లారు.
వనపర్తి సీఈగా ఏఎస్ఎన్ రెడ్డి..
వనపర్తి ఇరిగేషన్ టెరిటోరియల్ చీఫ్ ఇంజినీర్‌గా ఏ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభు త్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి సీఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయభాస్కర్‌రెడ్డిని రిలీవ్ చేయగా ఆయన స్థానంలో నాగర్‌కర్నూల్ సర్కిల్-2 ఎస్ఈ సత్యనారాయణరెడ్డికి సీఈగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. కాగా, ఏఎస్ఎన్ రెడ్డి ప్రస్తుతం హెచ్ఈఏ సలహాదారుగా కొనసాగుతున్నారు.
ట్యాంక్‌బండ్ ఘటన వివరాలివ్వండి ;హైదరాబాద్ సిటీ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఆదేశం
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో రెండు పడవలు మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సిటీ కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బుధవారం లేఖ రాశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామంలో యాదవ సామాజికవర్గానికి చెందిన 15 కుటుంబాల కుల బహిష్కరణ కు సంబంధించిన వివరాలను మూడు రోజుల్లో అందజేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారదను కమిషన్ ఆదేశించింది.