SCR | సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) గా కే పద్మజ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్ అధికారి. దక్షిణ మధ్య రైల్వేలో పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ & బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఆమె పట్టభద్రురాలు. ఇంతకు ముందు ఆమో దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్ మేనేజర్‌గా పనిచేశారు.
భారతీయ రైల్వేలో కే పద్మజ 30 ఏండ్లకుపైగా విశిష్టమైన కెరీర్ కొనసాగించారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అండ్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (కోల్ & గూడ్స్ ), సికింద్రాబాద్ డివిజన్లో సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్, గుంతకల్ డివిజన్లో డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, పీఆర్ఎస్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అండ్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు.
అటుపై రైల్ నిలయం ప్రధాన కార్యాలయంలో ఆమె డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (కోచింగ్), చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (జనరల్), చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్, చీఫ్ ఫ్రైట్ ట్రాఫిక్ మేనేజర్ అండ్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఫర్ ప్యాసింజర్ సర్వీసెస్ తదితర కీలక పదవులు నిర్వహించారు. గోదావరి ఫర్టిలైజర్స్ (రవాణ) సలహాదారుగా, కాంకర్ జనరల్ మేనేజర్ (హైదరాబాద్)గా పని చేశారు. ఇంకాఅదనంగా దక్షిణ మధ్య రైల్వే గైడ్స్ రాష్ట్ర కమీషనర్‌గా, దక్షిణ మధ్య రైల్వే హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా, దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి సికింద్రాబాద్ విభాగం ప్రెసిడెంట్, దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.