హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత, ఎంపీ కే కేశవరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎం వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై వారు కొద్దిసేపు చర్చించారు.