K Keshava Rao | కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా కే కేశవరావు నియామకం
K Keshava Rao | ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
K Keshava Rao | హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన కొనసాగనున్నారు. కే కేశవరావుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేకే వివరించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కేకే పదవీకాలం ముగిసేందుకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నది. దీంతో పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడిన నేతలు, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్ నాయకులు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, వీరి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

Kk
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

