హైదరాబాద్ : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మెటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కే పాపారావు.. బుద్ధప్రకాశ్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పాపారావు కమిషనర్‌కు వివరించారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అసోషియేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని పాపారావు తెలిపారు.