జన్నారంలో జువ్విగూడ అన్నదాతల రాస్తారోకో
జన్నారం, నవంబర్ 9 : అటవీ అధికారులు పొలాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం జువ్విగూడ రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని వంతెన వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. గంటపాటు ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై గొల్లపల్లి అనూష సిబ్బందితో అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.