హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్ మంగళవారం ప్రమా ణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఇప్పటివర కు మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన జస్టిస్ సుజయ్‌పాల్‌ను తెలంగాణకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుజయ్‌పాల్ కుటుంబసభ్యులు,అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ సుజయ్‌పాల్ కేసుల విచారణ చేపట్టారు. కాగా, కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై తెలంగాణ హైకోర్టుకు రానున్న జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఈ నెల 28న పదవీ ప్రమాణం చేయనున్నారు.