హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన ఫుల్ కోర్టు సమావేశమై జస్టిస్ షమీమ్ సేవలను కొనియాడింది. ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఘనంగా సతరించి వీడోలు చెప్పింది.