హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ పర్వతరావు(90) హైదరాబాద్‌లో బుధవారం కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. విజయవాడలో జన్మించిన పర్వతరావు మద్రాస్ లయోలా కాలేజీలో డిగ్రీ చేశారు. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయశాస్ర్తాన్ని అభ్యసించారు.